తెలంగాణ రాష్ట్రానికి ఇరిగేషన్ రంగంలో భారీ ఊరట.. మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి
హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.) తెలంగాణ రాష్ట్రానికి ఇరిగేషన్ రంగంలో భారీ ఊరట లభించింది. సీతారాం సాగర్ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ బ్యారేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏడాదిన్నర పాట
మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి


హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.) తెలంగాణ రాష్ట్రానికి ఇరిగేషన్ రంగంలో భారీ ఊరట లభించింది. సీతారాం సాగర్ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ బ్యారేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏడాదిన్నర పాటు చేసిన కృషి ఫలించి, ఇప్పుడు గోదావరి జలాల వినియోగానికి భారీ స్థాయిలో అవకాశం లభించినట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు గోదావరి నదీ జలాల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సీతారాం సాగర్ ద్వారా 68 టీఎంసీల గోదావరి నీరు లభించనుంది. ఇది సుమారు 8 లక్షల ఎకరాల సాగు భూములకు ఉపయోగపడనుంది. ఈ అనుమతులు తెలంగాణ ఇరిగేషన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తాయని ఉత్తమ్ పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande