తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైర్లు.
హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైర్లు వేశారు. దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీ గారికి స్వాగతం అని వ్యంగ్యంగా అన్నారు. మోసపూరిత హామీలు.. అబద్ధపు వాగ్దా
ఎమ్మెల్సీ కవిత


హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైర్లు వేశారు. దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీ గారికి స్వాగతం అని వ్యంగ్యంగా అన్నారు. మోసపూరిత హామీలు.. అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచేసి హైదరాబాద్కు వస్తున్న రాహుల్ గాంధీకి సుస్వాగతం అని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు సంధించారు.

16 నెలల పాలనలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం రాచిరంపాన పెట్టిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైడ్రా, మూసీ పేరుతో పేద ప్రజల మీదికి బుల్డోజర్లు పంపిందని.. లగచర్ల బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఒడిగట్టిందని.. సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని బంజారా యువతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande