ఢిల్లీ, 4 ఏప్రిల్ (హి.స.)
:వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్లో తెలుగు యువత ప్రతిభ చాటారు. బెస్ట్ యూత్ పార్లమెంటేరియన్ అవార్డును వి. లాస్యప్రియ సాధించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఉత్తమ సమాధానం ఇచ్చినందుకు ఈ అవార్డు గెలుచుకున్నారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అంశంపై అడిగిన ప్రశ్నకు లాస్యప్రియ సమాధానం ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల