ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
తెలంగాణ, ఆదిలాబాద్. 11 మే (హి.స.) ఆగి ఉన్న లారీని వెనుక నుండి కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ నుంచి
రోడ్డు ప్రమాదం


తెలంగాణ, ఆదిలాబాద్. 11 మే (హి.స.)

ఆగి ఉన్న లారీని వెనుక నుండి కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న కారు మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న వెంకటేష్, అన్వేష్ లకు తీవ్రగాయాలవగా వారిని అంబులెన్స్ లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్ అప్పటికే వెంకటేష్ మృతి చెందాడని ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande