జూన్ 6న అక్కినేని అఖిల్ పెళ్లి?
అమరావతి, 27 మే (హి.స.) అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. యువ హీరో అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె జైనబ్ రవ్‌డ్జీతో అఖిల్ వివాహం జరగనుంది. ఈ పెళ్లి జూన్ 6న జరగనుందనే వార్త వైరల్
/akhil-akkineni-wedding-on-june-6th


అమరావతి, 27 మే (హి.స.) అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. యువ హీరో అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె జైనబ్ రవ్‌డ్జీతో అఖిల్ వివాహం జరగనుంది. ఈ పెళ్లి జూన్ 6న జరగనుందనే వార్త వైరల్ అవుతోంది.

గత కొంతకాలంగా అఖిల్, జైనబ్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. నిశ్చితార్థం అనంతరం ఈ జంట పలుమార్లు కలిసి విహారయాత్రలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా వీరి వివాహ తేదీ ఖరారైందని, జూన్ 6న అఖిల్, జైనబ్ ఏడడుగులు వేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వినికిడి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande