తెలంగాణ, ఆదిలాబాద్. 31 మే (హి.స.)
ప్రపంచ టొబాకో నిరోధక దినోత్సవ
సందర్భంగా శనివారం ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా పోలీసు సిబ్బందికి, కుటుంబ సభ్యులకు దంత వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. టొబాకో వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయని వెల్లడించారు.
టొబాకో, వాటి ఉత్పత్తుల వినియోగం వల్ల, సిగరెట్, గుట్కా, జర్దా వంటి ఉత్పత్తులు వల్ల క్యాన్సర్, గుండెపోటు, శ్వాసకోశలాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని వివరించారు. సిబ్బంది స్వీయ నియంత్రణ క్రమశిక్షణను కలిగి ఉంటూ టొబాకో ఉత్పత్తులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు