జమ్మూ: 31 మే (హి.స.)
ఆపరేషన్ సింధూర్ సమయంలో బీఎస్ఎఫ్ మహిళా ఆఫీసర్ అసిస్టెంట్ కమాండెంట్ నేహ భండారీ నేతృత్వంలోని మహిళా దళం అసాధారణ సత్తాను చాటింది. ఈ నేపథ్యంలో నేహ భండారిని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కమెండేషన్ డిస్క్ తో ఆమెను సత్కరించారు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆమెను కీర్తించారు. జమ్మూలోని ఆక్నూర్ సెక్టార్ వద్ద.. పాక్ ఫార్వర్డ్ దళాలను ఆమె బృందం అడ్డుకున్నది.
అంతర్జాతీయ బోర్డర్ వద్ద ఉన్న పాకిస్థానీ పోస్టుపై చాకచక్యంగా నేహ భండారి బృందం ఎదుర్కొన్నది. జీరో లైన్ వద్ద సుమారు మూడు ఫార్వర్డ్ పోస్టులను ఆ దళం తిప్పికొట్టింది. నేహను సత్కరించిన అంశంపై బీఎస్ఎఫ్ జమ్మూకు చెందిన ఎక్స్ అకౌంట్లో పోస్టు పెట్టారు. చాలా విపత్కరమైన పరిస్థితుల్లో నేహ తన టీమ్‌ను లీడ్ చేసినట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..