కరీంనగర్ నగర అభివృద్ధి కోసం శాయ శక్తుల కృషి.. బండి సంజయ్.
తెలంగాణ, కరీంనగర్. 31 మే (హి.స.) కరీంనగర్ నగర పాలక సంస్థ అభివృద్ధి కోసం తన శాయ శక్తుల కృషి చేస్తానని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరపాలక సంస్థలోని గవర్నమెంట్ ఆస్పత్రి సమీపంలో గతంలో అగ్రి ప్రమాదంలో నష్టపోయిన పేదలకు సిమెంట్ డ్రిల
బండి సంజయ్


తెలంగాణ, కరీంనగర్. 31 మే (హి.స.)

కరీంనగర్ నగర పాలక సంస్థ అభివృద్ధి కోసం తన శాయ శక్తుల కృషి చేస్తానని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరపాలక సంస్థలోని గవర్నమెంట్ ఆస్పత్రి సమీపంలో గతంలో అగ్రి ప్రమాదంలో నష్టపోయిన పేదలకు సిమెంట్ డ్రిల్ యంత్రాలను ఎంపీ ల్యాండ్ నిధుల నుంచి వ్యయం చేసి శనివారం అందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం అత్యధిక నిధులు తీసుకువచ్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నానని తెలిపారు. నగరంలో కేంద్ర ప్రభుత్వం అందించిన నిధుల నుంచి ఇప్పటివరకు అభివృద్ధి సాగిందని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని నిధులు మంజూరు చేయిస్తున్నామని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande