సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందాలి : మంత్రి సీతక్క
తెలంగాణ, మంచిర్యాల. 31 మే (హి.స.) ప్రజా సంక్షేమం లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఫలాలు అర్హత గల ప్రతి ఒక్కరికి అందేలా అధికార యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత జిల్లా కార
మంత్రి సీతక్క


తెలంగాణ, మంచిర్యాల. 31 మే (హి.స.)

ప్రజా సంక్షేమం లో భాగంగా

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఫలాలు అర్హత గల ప్రతి ఒక్కరికి అందేలా అధికార యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు కుమార్ దీపక్, వెంకటేష్ దోత్రే, రాజర్షి షా, అభిలాష అభినవ్, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, శాసనమండలి సభ్యులు మల్క కొమురయ్య, దండే విఠల్, మంచిర్యాల, బెల్లంపల్లి, ముధోల్ నియోజకవర్గాల శాసనసభ్యులు కొక్కిరాల.ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, రామారావు పటేల్, జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి లతో కలిసి ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు, రెవెన్యూ, వ్యవసాయ, గృహ నిర్మాణ శాఖల అధికారులతో భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, యాసంగి వరి ధాన్యం సేకరణ, ఖరీఫ్ సాగు సన్నద్ధం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande