పసిడి ప్రియులకు ఇదే మంచి ఛాన్స్‌..! మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
న్యూ ఢిల్లీ, 5 మే (హి.స.)బంగారం కొనేందుకు ఇవి మంచి రోజులే అనిపిస్తోంది. ఎదుకంటే గత నాలుగు రోజులుగా బంగారం ధరలు ఊహించని విధంగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర మరింత తగ్గినట్లు కనిపిస్తోంది. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు
GOLD


న్యూ ఢిల్లీ, 5 మే (హి.స.)బంగారం కొనేందుకు ఇవి మంచి రోజులే అనిపిస్తోంది. ఎదుకంటే గత నాలుగు రోజులుగా బంగారం ధరలు ఊహించని విధంగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర మరింత తగ్గినట్లు కనిపిస్తోంది. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.9,550లు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.8,754లుగా ఉంది. ఇకపోతే,18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,163లుగా ఉంది. అయితే, బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావమే అంటున్నారు విశ్లేషకులు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ప్రధానంగా డాలర్ బలపడటంతో పాటు స్టాక్ మార్కెట్లు బలపడటం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక పరోక్ష కారణంగా చెప్పవచ్చు.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,690, 24 క్యారెట్ల ధర రూ.95,650 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల రేటు రూ.95,500 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500 గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande