శాంతి చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్.
కామారెడ్డి, 9 మే (హి.స.) శాంతి చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో మావోల మందుపాతర లో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెంది
మంత్రి పొన్నం ప్రభాకర్


కామారెడ్డి, 9 మే (హి.స.)

శాంతి చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో మావోల మందుపాతర లో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందిన విషయం విధితమే. విధి నిర్వహణలో అమరుడైనందున ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం జరిగిన అంత్యక్రియలకు ఆయన హాజరై కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ పార్థీవ దేహం పై పుష్ప గుచ్చం పెట్టి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హింసాయుత పద్ధతిలో ఏ సమస్యకు పరిష్కారం లభించదన్నారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జానారెడ్డి నేతృత్వంలో చర్చల కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

మావోయిస్టులు కూడా కాల్పుల విరమణ ప్రకటన చేయడం ప్రజాస్వామ్యంలో ఒక మెట్టు దిగినట్టుగా భావించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అహింసా మార్గంలో ఈ సమస్యకు పరిష్కారం చూడాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande