రైతులను మోసం చేయడం సిగ్గు చేటు.. ఆదిలాబాద్ జిల్లా రైతులు
తెలంగాణ, ఆదిలాబాద్. 10 జూన్ (హి.స.) పంట కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదంటూ ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ రైతులు ఆందోళన చేపట్టారు. వానాకాలం పంటకు విత్తనాలు కొందామన్నా తమవద్ద పైసలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భరోసా నగదును వె
ఆదిలాబాద్ రైతులు


తెలంగాణ, ఆదిలాబాద్. 10 జూన్ (హి.స.)

పంట కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదంటూ ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ రైతులు ఆందోళన చేపట్టారు. వానాకాలం పంటకు విత్తనాలు కొందామన్నా తమవద్ద పైసలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భరోసా నగదును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జొన్న పంట కొనుగోలు చేసిన ప్రభుత్వం నెలలు గడుస్తున్నా ఇప్పటికి డబ్బులు చెల్లించలేదని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జొన్నలను కొనుగోలు చేసిన ప్రభుత్వం ఇన్ని రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించడం లేదన్నారు. కనీసం ఖరీఫ్లో విత్తనాలు, ఎరువులు కొనడానికి కూడా చేతిలో చిల్లి గవ్వ లేక వ్యాపారుల వద్ద చేయి చాపాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందరు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande