రూ. 25 కోట్లు డిమాండ్ చేసిన దీపిక పదుకొణె.. తప్పేముందున్న బాలీవుడ్ డైరెక్టర్
ముంబై, 13 జూన్ (హి.స.)బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణె ఓ భారీ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగడానికి ఆమె డిమాండ్లే కారణమని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. నిర్దిష్ట పనిగంటలతో పాటు, రూ.25 కోట్ల భారీ పారితోషికం అడగటం వల్లే ఆమెను ప్
రూ. 25 కోట్లు డిమాండ్ చేసిన దీపిక పదుకొణె.. తప్పేముందున్న బాలీవుడ్ డైరెక్టర్


ముంబై, 13 జూన్ (హి.స.)బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణె ఓ భారీ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగడానికి ఆమె డిమాండ్లే కారణమని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. నిర్దిష్ట పనిగంటలతో పాటు, రూ.25 కోట్ల భారీ పారితోషికం అడగటం వల్లే ఆమెను ప్రాజెక్ట్ నుంచి తొలగించారని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై ‘భజరంగీ భాయీజాన్‌’, ‘చందూ ఛాంపియన్‌’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు కబీర్‌ ఖాన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పనివేళల విషయంలో దీపికా పదుకొణె చేసిన డిమాండ్‌ను కబీర్ ఖాన్ సమర్థించారు. నేను దాదాపు 500 మంది సిబ్బందితో కలిసి పనిచేస్తుంటాను. సినిమా రంగంలో పనిచేసే వారికి కూడా సొంత జీవితాలు ఉంటాయి, వారి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. బాలీవుడ్ స్టార్ హీరోలైన ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌లు కూడా రోజుకు 8 గంటల షిఫ్ట్‌లో మాత్రమే పనిచేస్తారు. అలాంటప్పుడు, దీపికా విషయంలో ఇదే అంశాన్ని ఎందుకు తప్పుగా పరిగణిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande