
అమరావతి, 14 జూన్ (హి.స.)
అప్పలాయగుంట: అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. పుణ్యాహవచనం, నవగ్రహపూజ, రథారోహణం, రథాగమన కార్యక్రమాల అనంతరం రథోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య అశ్వవాహనంపై స్వామివారు భక్తులను ఆశీర్వదిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ