జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారి గా ఎం.రామ్మోహన్ నియామకం..
తెలంగాణ, మంచిర్యాల. 14 జూన్ (హి.స.) మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారి (ఎఫ్డీఓ) గా ఎం.రామ్మోహన్ ను నియమిస్తూ రాష్ట్ర ముఖ్య అటవీశాఖ అధికారిణి సి.సువర్ణ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రామ్మోహన్ హైదరాబాద్ లోని దూలపల్లి శిక్షణ అకాడమీల
ఫారెస్ట్ ఆఫీసర్


తెలంగాణ, మంచిర్యాల. 14 జూన్ (హి.స.)

మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారి (ఎఫ్డీఓ) గా ఎం.రామ్మోహన్ ను నియమిస్తూ రాష్ట్ర ముఖ్య అటవీశాఖ అధికారిణి సి.సువర్ణ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రామ్మోహన్ హైదరాబాద్ లోని దూలపల్లి శిక్షణ అకాడమీలో రేంజ్ ఆఫీసర్ హోదాలో ఉంటూ, కోర్స్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10మంది సీనియర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పదోన్నతి కల్పించారు.అందులో రామ్మోహన్ కు రేంజ్ ఆఫీసర్ నుంచి ఎఫ్డీఓగా పదోన్నతి కల్పిస్తూ జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారిగా నియమించారు. గత 2023అక్టోబర్ లో ఇక్కడ ఎఫ్డీఓగా పనిచేసిన ఎస్.మాధవరావును హైదరాబాద్ రాష్ట్ర ముఖ్య అటవీశాఖ కార్యాలయానికి బదిలీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande