
తెలంగాణ, నిజామాబాద్. 19 జూన్ (హి.స.)
నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డి ని ఎంపీ ధర్మపురి అరవింద్ కలిశారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని పలు అంశాలు, అభివృద్ధి పనులపై కలెక్టర్ తో ఎంపీ అరవింద్ చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు