
నెల్లూరు, 2 జూన్ (హి.స.)
:అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి )కి భారీ షాక్ )లు తగులుతున్నాయి. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన నేతలు కొందరు వేరే పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు వైసీపీ ( నుంచి జంప్ కాగా.. తాజాగా నెల్లూరు జిల్లా, కోవూరు )లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మానేగుంట, రామన్నపాళెం, రెడ్డిపాళెం, కమ్మపాళెం పంచాయతీల్లోని అన్ని గ్రామాల్లోనూ మాజీ మంత్రి ప్రసన్న తీరుపై వైసీపీ నేతలు, శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో 1500 మందికి పైగా వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరబోతున్నారు. ఈ సందర్భంగా వారికి ఎంపీ వేమిరెడ్డి దంపతులు, నాపా వెంకటేశ్వర్లు నాయుడు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ