
తెలంగాణ, సిద్దిపేట. 20 జూన్ (హి.స.)
హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఎటీసీఎస్ ) మంజూరైనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనలో వెల్లడించారు. హుస్నాబాద్ నియోజకవర్గం తోటపల్లి లో రూ. 45.15 కోట్లు ఖర్చు తో నిర్మించనున్నట్లు తెలిపారు. కార్మిక ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 46 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల స్థాపనకు పరిపాలన అనుమతి ఉత్తర్వులు జారీ అయినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఐటీఐ లో ఎన్ సీవీ టీ అనుమతించబడిన ఇండస్ట్రీ 4.0 ట్రేడ్స్ ఆధారంగా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించేందుకు మొత్తం 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల స్థాపనకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ భాగస్వామ్యంలో అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు