నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రి పాలైన 17 మంది విద్యార్థులు
మహబూబాబాద్, 22 జూన్ (హి.స.) నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 17 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు అయ్యారు. ఈ షాకింగ్ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో చోటు చేసుకుంది. రోజువారీ లాగానే ఆదివారం తెల్లవారుజామున.. విద్యార్
ఫుడ్ పాయిజన్


మహబూబాబాద్, 22 జూన్ (హి.స.)

నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 17 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు అయ్యారు. ఈ షాకింగ్ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో చోటు చేసుకుంది. రోజువారీ లాగానే ఆదివారం తెల్లవారుజామున.. విద్యార్థులకు మొలకలు ఇచ్చారు. వాటిని తిన్న కాసేపటికే 17 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది విద్యార్థులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు వారికి చికిత్స అందించి.. ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. అలాగే ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా.. అధికారులు ఎవరు ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande