నేడు ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ.. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చ!
అమరావతి, 24 జూన్ (హి.స.)నేడు ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ జరగనుంది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం కానుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై కేబినెట్‌ సబ్‌ క
నేడు ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ.. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చ!


అమరావతి, 24 జూన్ (హి.స.)నేడు ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ జరగనుంది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం కానుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సోమవారం రాజధాని అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అయిన విషయం తెలిసిందే. సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ సమాశేం జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande