ఆరోగ్య రంగాన్ని బలపర్చడంలో వైద్యుల కృషి అసాధారణమైనది: ప్రధాని మోడీ
ఢిల్లీ, 1 జూలై (హి.స.)ప్రతి ఏడాది జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని (National Doctors Day) జరుపుకుంటాం. ప్రముఖ వైద్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ వైద్యుడు కీ.శే బిధాన్ చంద్రరాయ్ (Bidhan Chandra Roy) వైద్య రంగంలో
ఆరోగ్య రంగాన్ని బలపర్చడంలో వైద్యుల కృషి అసాధారణమైనది: ప్రధాని మోడీ


ఢిల్లీ, 1 జూలై (హి.స.)ప్రతి ఏడాది జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని (National Doctors Day) జరుపుకుంటాం. ప్రముఖ వైద్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ వైద్యుడు కీ.శే బిధాన్ చంద్రరాయ్ (Bidhan Chandra Roy) వైద్య రంగంలో చేసిన సేవలకు గానూ ఆయన జయంతి, వర్థంతిని పురస్కరించుకుని ఈ రోజున జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశంలోని వైద్యులందరీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ట్వీట్ చేశారు. 'కష్టపడే వైద్యులందరికీ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. మన వైద్యులు తమ నైపుణ్యం, క్రమశిక్షణతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. అలాగే, వారు చూపుతున్న కరుణ కూడా ఎంతో గొప్పది. వారు నిజంగా ఆరోగ్య రక్షకులు, మానవతా మూలస్తంభాలు. భారతదేశ ఆరోగ్య రంగాన్ని బలపర్చడంలో వారి కృషి అసాధారణమైనది' అని మోడీ ట్వీట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande