భద్రాచలం, 29 జూలై (హి.స.)
చత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఈ నెల 28 నుంచి జరుగుతుండగా, భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మావోలు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. వెంటనే కోలుకున్న బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్