సివిల్ సప్లై స్కాంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ ప్రధాన పాత్రధారులు. మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, 29 జూలై (హి.స.) తెలంగాణ సివిల్ సప్లైస్ స్కాంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్
ఎమ్మెల్యే మాజీ పెద్ది


హైదరాబాద్, 29 జూలై (హి.స.)

తెలంగాణ సివిల్ సప్లైస్ స్కాంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డినే ప్రధాన పాత్రధారులు అని అన్నారు. పౌరసరఫరాల శాఖలో కుంభకోణంపై వారు నేడు ఈడీకి ఫిర్యాదు చేశారు.

అనంతరo తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు గంగుల కమలాకర్, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి సుదర్శన్ మాట్లాడుతూ.. పద్దెనిమిది నెలల క్రితం జరిగిన ధాన్యం కొనుగోలు టెండర్ల కుంభకోణంపై ఇప్పటికే 8సార్లు ప్రెస్మీట్ పెట్టినప్పటికీ కాంగ్రెస్ నుంచి గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ స్పందన లేదని తెలిపారు. ఇదే అంశంపై అసెంబ్లీలో తమ నేతలు కేటీఆర్, హరీశ్రావు లేవనెత్తినప్పటికీ స్పందన రాలేదన్నారు. దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయించామని పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande