మూసి ఆక్రమణలపై హైడ్రా కొరడా..
హైదరాబాద్, 29 జూలై (హి.స.) హైదరాబాద్ లోని మూసీ లో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. మూసి పరివాహక ప్రాంతంలోగల చాదర్ ఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా ఆసుపత్రి వరకు పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి
హైడ్రా


హైదరాబాద్, 29 జూలై (హి.స.)

హైదరాబాద్ లోని మూసీ లో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. మూసి పరివాహక ప్రాంతంలోగల చాదర్ ఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా ఆసుపత్రి వరకు పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి తిష్టవేసి, మూసీని ఆక్రమించి, పలు నిర్మాణాలు చేపట్టి వాటిని ప్రయివేట్ బస్సులకు, లారీలకు కిరాయికి ఇస్తున్నట్టు, రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు స్థానికులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో మూసి పరివాహక ప్రాంతంలో విచారణ చేపట్టిన అధికారులు, ఆక్రమణలు నిజమేనని తేల్చారు.

ఈరోజు ఉదయం నుంచి పోలీసు బందోబస్తు నడుమ మూసీని ఆక్రమించి వేసిన షెడ్డులను తొలగిస్తున్నారు. నగరంలోని చెరువులు, నీటి ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతంలో, ఇంకా ఏవైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనట్టు గమనిస్తే నగర పౌరులు స్వచ్చందంగా హైడ్రాకు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande