పెద్దిరాజు వర్సెస్ రేవంత్ రెడ్డి కేసు.. సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్, 29 జూలై (హి.స.) సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. పెద్దిరాజు అనే వ్యక్తి రేవంత్ రెడ్డిపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులో ఇప్పటికే హైకోర్టు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ పిటిషన్ ను క్వాష
సుప్రీం కోర్ట్


హైదరాబాద్, 29 జూలై (హి.స.)

సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. పెద్దిరాజు అనే వ్యక్తి రేవంత్ రెడ్డిపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులో ఇప్పటికే హైకోర్టు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ పిటిషన్ ను క్వాష్ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను పెద్దిరాజు సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. ఈ నేపథ్యంలో అతడు వేసిన పిటిషన్ ను నేడు సుప్రీం కోర్ట్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఎన్ పెద్దిరాజుతోపాటు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బి ఆర్ గవాయ్ పిటీషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తదుపరి విచారణకు పిటిషనర్ అండ్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని సిజేఐ ఆదేశించారు.

పిటిషనర్ తరపు న్యాయవాది రితీష్ పాటిల్ కోర్టు సాక్షిగా క్షమాపణ కోరాడు. కేసు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోవద్దంటూ ప్రశ్నించారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కోర్టు ధిక్కరణ నోటీస్ పై వ్రాత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది అని తెలపింది. తదుపరి విచారణ ఆగస్టు 11 కు వాయిదా వేసింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande