హైదరాబాద్, 9 జూలై (హి.స.)
సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ప్రమాదం జరిగిన రోజు గల్లంతైన 8 మంది కార్మికులు ఇంకా కనిపించకపోవడంతో, ఇక వారి ఆచూకీ లభించడం అసాధ్యమే అని అధికారులు తేల్చేశారు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ల బాడీలు పేలుడు సమయంలో తీవ్రంగా కాలిపోయి బూడిదయ్యి ఉంటారని యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇప్పటివరకు 100కి పైగా శాంపిల్స్ ను సేకరించి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించినా ఒకటికీ కూడా తగిన పోలిక లభించలేదు.
ఈ నేపథ్యంలో, బాధిత కార్మికుల కుటుంబ సభ్యులను పరిశ్రమ వద్ద నుంచి ఇళ్లకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మూడునెలల తర్వాత తిరిగి రావాలని సూశించారు. అప్పటివరకు రాష్ట్ర, కేంద్ర హోంశాఖలతో సంప్రదింపులు కొనసాగిస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..