మహబూబాబాద్, 9 జూలై (హి.స.)
మహబూబాబాద్ నియోజకవర్గంలో నిన్న జరిగిన కాంగ్రెస్ ప్రజా పాలన సభ అట్టర్ ప్లాప్ అయిందనీ.. ఆరుగురు మంత్రులు వచ్చి ఆర్భాటం చేశారు తప్పా అభివృద్ధికి కోసం చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం ఆమె మహబూబాబాద్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సభలో బీఆర్ఎస్ నేతలపై విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ పాలనలో అభివృద్ధి మీద చర్చకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమా? అని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరు నెలల కింద కురవి మండలం వద్ద శంకుస్థాపన చేసిన పని ఇంకా ప్రారంభం కూడా కాలేదన్నారు.
భట్టి విక్రమార్క తన స్థాయిని మించి మాట్లాడుతున్నాడు. పంచెలు కట్టినంత మాత్రాన రైతులు అవుతారా? అని నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లకు ఒక్క రూపాయి అయిన చెల్లించారా.. భూభారతి ద్వారా ఒక్క ఎకరం భూమి సమస్య అయిన పరిష్కారం చేసావా అని మంత్రి పొంగులేటిని ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..