హైదరాబాద్, 9 జూలై (హి.స.)
భద్రాచలం భూముల వివాదంపై మంత్రి
కొండా సురేఖ స్పందించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భద్రాచలం భూముల వివాదం చాలా రోజులుగా నడుస్తోంది. ఏడు మండలాలు ఏపీలో కలవడం వల్లే ఈ గొడవలు మొదలయ్యాయి. ఆలయ భూముల్లో ఇప్పటికే 60 కట్టడాలు వచ్చాయి. చాలా రోజుల నుంచి వారికి నచ్చజెబుతున్నాం.. కానీ ప్రతిసారి గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. ఈసారి ఏకంగా దాడి చేసే ప్రయత్నం చేశారు. దీనిపై ఏపీలో కేసు నమోదు చేయాల్సి ఉంది. అందుకే తాము చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదు. ఏపీ ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి లేఖ కూడా రాశాం.. వారితో మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సైతం రిక్వెస్ట్ చేశాం' అని మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..