హైదరాబాద్, 9 జూలై (హి.స.)
తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ మైనారిటీ విభాగం సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ సమాజం మొత్తం జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని గుర్తుచేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు హరీష్ రావు పిలుపునిచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..