విజయనగరం, 9 జూలై (హి.స.)అర్ధరాత్రి బాలికల హాస్టల్‌లో అగ్ని ప్రమాదం (Fire accident) చోటు చేసుకోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలోని కేజీబీవీ హాస్టల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తవలస మండలం తుమ్మకాపల్లి గ్రామంలోని కేజీబీవీ హాస్టల్ (KGBV Hostel) ఉంది. ఇందులో మంగళవారం రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటర్ సెకండియర్ స్టోర్ రూంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు చెలరేగాయి. ఇది గమనించిన విద్యార్థులు బిగ్గరగా అరవడం మొదలు పెట్టారు. దీంతో అక్కడే ఉన్న వార్డెన్, ఇతర సిబ్బంది హుటాహుటిన విద్యార్థులను బయటకు సురక్షితంగా తరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి