ఆపరేషన్ సిందూర్‌ను చదరంగం ఆటగా అభివర్ణించిన ఆర్మీ చీఫ్
దిల్లీ:,10 ఆగస్టు (హి.స.)ఆపరేషన్ సిందూర్ చెస్ ఆటలా కొనసాగిందని, శత్రువు ఏ అడుగు వేస్తాడో తెలియని ఒక గ్రే జోన్ లో జరిగిందన్నారు. ఈ ఆపరేషన్‌ను జనరల్ ద్వివేది చెస్ ఆటతో పోల్చారు. ఎందుకంటే, ఇక్కడ శత్రువు ఏం చేస్తాడో, మనం ఏం చేయబోతున్నామో ఎవరికీ స్పష్టం
్ైగనా్గ


దిల్లీ:,10 ఆగస్టు (హి.స.)ఆపరేషన్ సిందూర్ చెస్ ఆటలా కొనసాగిందని, శత్రువు ఏ అడుగు వేస్తాడో తెలియని ఒక గ్రే జోన్ లో జరిగిందన్నారు.

ఈ ఆపరేషన్‌ను జనరల్ ద్వివేది చెస్ ఆటతో పోల్చారు. ఎందుకంటే, ఇక్కడ శత్రువు ఏం చేస్తాడో, మనం ఏం చేయబోతున్నామో ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఇది పూర్తి స్థాయి యుద్ధం కాదు, కానీ అంతకంటే కొంచెం తక్కువ స్థాయిలో జరిగిన ఒక గ్రే జోన్ ఆపరేషన్ అని వెల్లడించారు. ఈ ఆపరేషన్ ప్లానింగ్ ఏప్రిల్ 23న ప్రారంభమైంది. ఆ రోజు మూడు సైనిక దళాల చీఫ్‌లు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక చాలు, ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.

ఆ క్రమంలో ఏప్రిల్ 25 నాటికి నార్తర్న్ కమాండ్ తమ ప్లాన్‌ను సిద్ధం చేసి, తొమ్మిది లక్ష్యాల్లో ఏడు దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ ఆపరేషన్, గతంలో జరిగిన ఉరి, బాలాకోట్ ఆపరేషన్‌లకు భిన్నంగా ఉంది. ఉరి ఆపరేషన్‌లో లాంచ్ ప్యాడ్‌లను టార్గెట్ చేసి సందేశం ఇచ్చారు. బాలాకోట్‌లో పాకిస్తాన్‎లోని శిక్షణ శిబిరాలను ధ్వంసం చేశారు. కానీ ఆపరేషన్ సిందూర్ మరింత విస్తృతంగా కొనసాగింది. మనం శత్రు భూభాగంలోకి వెళ్లి నర్సరీ, మాస్టర్స్ అనే కోడ్‌నేమ్‌లతో కీలక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande