దిల్లీ:, 10 ఆగస్టు (హి.స.)జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరగనుంది. అదేరోజు ఫలితం విడుదల కానుంది.
ఇక ఉపరాష్ట్రపతి పదవిని కైవసం చేసుకునేందుకు అధికార ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ఉంది. ఈజీగా ఈ ఎన్నిక గెలవనుంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి కూడా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మల్లిఖార్జున ఖర్గే విపక్ష పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏకాభిప్రాయం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి.
అధికారికంగా చర్చలు ఇంకా ప్రారంభం కానప్పటికీ.. అనధికారికంగా మాత్రం కూటమి నేతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిని నామినేట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
7
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు