న్యూఢిల్లీ, 12 ఆగస్టు (హి.స.) దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఇటీవల వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ఘటనపై సుమోటో గా కేసు తీసుకొని విచారించిన సుప్రీంకోర్టు.. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం నుండి అన్ని వీధి కుక్కలను తొలగించాలని, ఎవరైన జంతు ప్రేమికులు అడ్డు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్లో కోర్టు నిర్ణయం దశాబ్దాల మానవీయ, శాస్త్రీయ ఆధారిత విధానం నుండి వెనక్కి తగ్గడం అని రాసుకొచ్చారు.
ఇవి మూగ జంతువులు తొలగించవలసిన సమస్యలు కావు క్రూరత్వం లేకుండా ప్రజా భద్రతను నిర్ధారించడానికి షెల్టర్లు, స్టెరిలైజేషన్, టీకాలు వేయడం, సమాజ సంరక్షణను అనుసరించాలని ఈ సందర్భంగా రాహుల్ అధికారులను కోరారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్