దిల్లీలో వీధికుక్కలు కనిపించకూడదు
దిల్లీ:12 ఆగస్టు (హి.స.) దేశ రాజధానిలో పెరుగుతున్న కుక్కకాటు ఉదంతాలపై సుప్రీంకోర్టు మండిపడింది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లోని వీధి కుక్కలన్నిటినీ షెల్టర్లకు తరలించాలని సోమవారం ఆదేశాలు జారీచేసింది. తగినంత మంది సిబ్బందితో పాటు సీసీటీవీ కెమెరాలు,
Supreme Court


దిల్లీ:12 ఆగస్టు (హి.స.) దేశ రాజధానిలో పెరుగుతున్న కుక్కకాటు ఉదంతాలపై సుప్రీంకోర్టు మండిపడింది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లోని వీధి కుక్కలన్నిటినీ షెల్టర్లకు తరలించాలని సోమవారం ఆదేశాలు జారీచేసింది. తగినంత మంది సిబ్బందితో పాటు సీసీటీవీ కెమెరాలు, కుక్కల పునరుత్పత్తిని నిర్మూలించే శస్త్ర చికిత్సలకు ఏర్పాట్లు వీటిలో ఉండాలని పేర్కొంది. కనీసం ఐదువేల కుక్కలకు వసతి కల్పించగల షెల్టర్లను 6-8 వారాల్లోగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వీధి కుక్కల్ని వెనకేసుకొచ్చే సంస్థలు.. రేబిస్‌ బారినపడి మరణిస్తున్న పసిపిల్లల్ని తిరిగి తేగలవా అని ప్రశ్నించింది. వీధికుక్కలకు అనుకూలంగా సమర్పించే ఎలాంటి దరఖాస్తునూ అనుమతించేది లేదని జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌ల ధర్మాసనం స్పష్టంచేసింది. దిల్లీలో ఎక్కడా వీధి కుక్కలు కనబడటానికి వీల్లేదని స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదావేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande