హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
: నేడు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ