తిరుపతి దక్షిణ దిశ విస్తరణకు శుభారంభం
తిరుపతి, 14 ఆగస్టు (హి.స.) తిరుపతి నగరం దక్షిణ దిశగా విస్తరణకు మార్గం సుగమం కానుంది. నగరానికి దక్షిణంగా ఉన్న పల్లెల ప్రజలకు జాతీయ రహదారిని దాటడం అనే ప్రాణాంతక సమస్యకు పరిష్కారం లభిస్తోంది. ఆరు వరుసలుగా విస్తరణ జరుగుతున్న జాతీయ రహదారిపై కొత ఫ్లైవోవర్
తిరుపతి


తిరుపతి, 14 ఆగస్టు (హి.స.)

తిరుపతి నగరం దక్షిణ దిశగా విస్తరణకు మార్గం సుగమం కానుంది. నగరానికి దక్షిణంగా ఉన్న పల్లెల ప్రజలకు జాతీయ రహదారిని దాటడం అనే ప్రాణాంతక సమస్యకు పరిష్కారం లభిస్తోంది. ఆరు వరుసలుగా విస్తరణ జరుగుతున్న జాతీయ రహదారిపై కొత ఫ్లైవోవర్లు, అండర్‌పాసులు నిర్మించనున్నారు. ఇందువల్ల రోడ్డు ప్రమాదాలకు అవకాశముండదు.

నిర్మాణ సంస్థ:

టీపీఎఫ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వొయాన్స్డ్ సొల్యూషన్స్ లిమిటెడ్ తిరుపతి-ఆంధ్రజ్యోతి: చిత్తూరు-నాయుడుపేట ఆరు లేన్ల రహదారిలో సి.మల్లవరం నుంచి రేణిగుంట కేఎల్ఎం కూడలి దాకా మాత్రమే నాలుగు లేన్ల రహదారి ఉండిపోయింది. దీన్ని కూడా ఆరు లేన్ల రహదారిగా విస్తరించే పనులు జోరుగా సాగుతున్నాయి. 17.40 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రహదారిపై కొత్తగా మూడు ఫ్లైవోవర్లు, 5 అండర్‌పాసులు నిర్మిస్తున్నారు. సర్వీస్ రోడ్లు ఉంటాయి.

యాక్సెస్ కంట్రోల్డ్ హైవే

'యాక్సెస్ కంట్రోల్డ్ హైవే’గా రూపుదిద్దుకుంటున్న ఈ జాతీయ రహదారి తిరుపతి నగర విస్తరణలో కీలక పాత్ర పోషిం చబోతోంది. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ 2024 నవంబరు 5న దీనికి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి ఎన్‌హెచ్ 716గా నామకరణం చేశారు. ఇప్పటివరకు 11 శాతం పనులు పూర్తయ్యాయి. ఏడాదిన్నరలో పూర్తిగా అందుబాటు లోకి రానుంది. ప్రస్తుతం విస్తరణ పనులతో పాటు రామానుజపల్లె, మల్లవరం వద్ద అండర్ పాస్ పనులు మొదలు పెట్టారు.

వేగంగా, సురక్షితంగా వాహనాలు ప్రయాణించేలా ఈ హైవే నిర్మాణం జరుగుతోంది. హైవేను క్రాస్ చేసే అవసరం ఎక్కడా ఇక ఉండదు. హైవేకి సమాంతరంగా అటూ, ఇటూ సర్వీస్ రోడ్లు ఉంటాయి. హైవే మీదకు ఎక్కడానికీ, దిగడానికీ ఈ సర్వీస్ రోడ్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి. పశువులు హైవే మీదకు వచ్చే వీలే లేకుండా బారికేడ్లు నిర్మిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande