రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ను అమలు.చేసేందుకు ఏపీ ఈ ఆర్ సీ ఆమోదం
అమరావతి, 3 ఆగస్టు (హి.స.)రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎస్ఎస్‌)ను అమలు చేసేందుకు విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పవర్‌ సిస్టమ్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ (పీఎ్‌సడీఎఫ్‌) కింద నిధులు వ్యయం చేసేందుకు కూడా
రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ను అమలు.చేసేందుకు ఏపీ ఈ ఆర్ సీ ఆమోదం


అమరావతి, 3 ఆగస్టు (హి.స.)రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎస్ఎస్‌)ను అమలు చేసేందుకు విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పవర్‌ సిస్టమ్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ (పీఎ్‌సడీఎఫ్‌) కింద నిధులు వ్యయం చేసేందుకు కూడా ఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీఈఆర్‌సీ ఉత్తర్వు జారీ చేసింది. సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో పగటి పూట ఉత్పత్తి అయిన విద్యుత్తును రాత్రి సమయంలోనూ వినియోగించుకునేందుకు వీలుగా బ్యాటరీ స్టోరేజీ విధానాన్ని వాడుకోవాలని కేంద్ర ఇంధన శాఖ రాష్ట్రాలకు సూచించింది.

ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ నిర్ణయించింది. ప్రధానంగా గిరిజన తండాల్లో సౌర విద్యుత్తును బ్యాటరీలో నిక్షిప్తం చేసి రాత్రి సమయంలో వాడుకునే పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు ఇప్పటికే కార్యాచరణను రూపొందించాయి. ఈ కార్యచరణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును పరిశీలించిన ఈఆర్‌సీ... వయబిలిటీ గ్యాఫ్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) కింద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌కు నిధులు వ్యయం చేసుకోవచ్చంటూ ఏపీ ట్రాన్స్‌కోకు అనుమతి ఇచ్చింది. నోడల్‌ ఏజెన్సీగా ఏపీ ట్రాన్స్‌కో బీఈఎ్‌సఎస్‌ కోసం టెండర్లను పిలవనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande