తిరుపతిలో సెప్టెంబర్ 14,15 తేదీల్లో మహిళా ఎమ్మెల్యేలకు ప్రత్యేక సమావేశాలు/స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓ లో
అమరావతి, 30 ఆగస్టు (హి.స.) నర్సీపట్నం: తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా ఎమ్మెల్యేలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మీడియాకు విడుదల చేసిన వీడి
తిరుపతిలో సెప్టెంబర్ 14,15 తేదీల్లో మహిళా ఎమ్మెల్యేలకు ప్రత్యేక సమావేశాలు/స్పీకర్  అయ్యన్నపాత్రుడు ఓ లో


అమరావతి, 30 ఆగస్టు (హి.స.)

నర్సీపట్నం: తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా ఎమ్మెల్యేలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు.

ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు సదస్సుకు హాజరు కానున్నట్టు చెప్పారు.

ఈ కార్యక్రమానికి తొలిరోజు సీఎం చంద్రబాబు, లోక్‌సభ స్పీకర్‌ హాజరవుతారని, ముగింపు రోజున గవర్నర్‌ హాజరుకానున్నారని ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు శ్రీవారి దర్శనం కల్పించించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెప్టెంబరు 18 నుంచి శాసనసభ సమావేశాలు జరగుతాయని, ఈమేరకు ఎమ్మెల్యేలకు సమాచారం పంపించినట్టు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande