అమరావతి, 31 ఆగస్టు (హి.స.):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం కారయ్యింది. సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. 10 రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ భేటీలో.. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్నీ గత నెలలలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ