కర్నూలు, 7 ఆగస్టు (హి.స.)
స్వాతంత్య్ర దినోత్సవం రోజు మహిళలకు ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రవాణా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మహిళలు ఆధార్‌కార్డు చూపించి జీరో టికెట్‌తో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు కొత్తగా వంద విద్యుత్తు బస్సులు వచ్చే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ