విశాఖపట్నం, 7 ఆగస్టు (హి.స.)
: నగరంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురై గుర్తుపట్టని విధంగా మారిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. స్క్రాప్ దుకాణంలో వెల్డింగ్ చేసే సిలిండర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ