120 డిగ్రీలు చేసి గిన్నిస్ రికార్డ్ సొంతం.చేసుకున్న విద్యావేత్త పట్నాల జాన్ సుధాకర్ మృతి
విశాఖపట్నం, 7 ఆగస్టు (హి.స.) : 120 డిగ్రీలు చేసి గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్న విద్యావేత్త పట్నాల జాన్‌ సుధాకర్‌ (68) బుధవారం అస్తమించారు. పెందుర్తి మండలం పెదగాడి గ్రామానికి చెందిన సుధాకర్‌ మొదట్లో సీబీఐలో చిన్నస్థాయి ఉద్యోగిగా చేరారు. అనంతరం ప
120 డిగ్రీలు చేసి గిన్నిస్ రికార్డ్ సొంతం.చేసుకున్న విద్యావేత్త పట్నాల జాన్ సుధాకర్  మృతి


విశాఖపట్నం, 7 ఆగస్టు (హి.స.)

: 120 డిగ్రీలు చేసి గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్న విద్యావేత్త పట్నాల జాన్‌ సుధాకర్‌ (68) బుధవారం అస్తమించారు. పెందుర్తి మండలం పెదగాడి గ్రామానికి చెందిన సుధాకర్‌ మొదట్లో సీబీఐలో చిన్నస్థాయి ఉద్యోగిగా చేరారు. అనంతరం పలు డిగ్రీలు చేస్తూ సివిల్స్‌కు ఎంపికయ్యారు. దిల్లీలో సమాచార, ప్రసార శాఖ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు చదువు కొనసాగించి 120 డిగ్రీలు పూర్తి చేశారు. సుధాకర్‌కు పెళ్లి కాకపోవడంతో విశాఖపట్నంలో సోదరుడు ప్రసాద్‌తో కలిసి నివాసం ఉంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande