హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.)
, : రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. గురువారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో, శుక్రవారం జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నెల 9న కుమురం గురువారం , నిర్మల్, నిజామాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ