గుంతకల్లు లో. వీ ఆర్వో మోసానికి బలి విషగులికలు మింగి..షమీమ్ బాను ఆత్మహత్య
గుంతకల్లు, 7 ఆగస్టు (హి.స.) : గుంతకల్లులో షమీమ్‌బాను (33) విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె మృతికి వీఆర్వో మహమ్మద్‌వలి కారణమని ఆమె తండ్రి పీరాబాషా ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశాడు. బాధితులు తెలిపిన వివరాల
గుంతకల్లు లో. వీ ఆర్వో మోసానికి బలి విషగులికలు మింగి..షమీమ్ బాను ఆత్మహత్య


గుంతకల్లు, 7 ఆగస్టు (హి.స.)

: గుంతకల్లులో షమీమ్‌బాను (33) విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె మృతికి వీఆర్వో మహమ్మద్‌వలి కారణమని ఆమె తండ్రి పీరాబాషా ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గుంతకల్లులోని సోఫియా స్ట్రీట్‌కు చెందిన పీర్‌బాషా కుమార్తె షమీమ్‌బాను రాయచూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో ఐదేళ్ల కిందట పెళ్లి జరిగింది. ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. షమీనాబాను 3 ఏళ్ల కిందట రేషన్‌కార్డులో మార్పులు, చేర్పుల కోసం గుంతకల్లు తహసీల్దార్‌ కార్యాలయంలో పని చేసే వీఆర్వో మహమ్మద్‌వలిని కలిసింది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వీఆర్వో యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె 7 నెలల గర్భిణి కావడంతో దూరం పెడుతూ వచ్చాడు. గత జులైలో పోలీస్‌ స్టేషన్‌లో ఆమె వీఆర్వోపై ఫిర్యాదు చేసింది. ఆమె బంగారాన్ని తాకట్టు పెట్టాడని, ప్రసవం దగ్గర పడింది వైద్యం చేయించాలని వీర్వోను కోరగా బెదిరించడంతో మోసపోయానని భావించి బుధవారం విషగుళికులు మింగింది. గుంతకల్లు ఆసుపత్రికి వెళ్లగా పరిస్థితి విషమించడంతో అనంతపురానికి తీసుకెళ్లాలని సూచించారు. ఈక్రమంలో మార్గమధ్యంలో మృతిచెందింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande