హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.)ట్రంప్ టారిఫ్‌పై కాంగ్రెస్ ఎంపీ శిశథరూర్ స్పందించారు. ట్రంప్ విధించిన సుంకాలకు భారత్ కూడా ప్రతీకారం తీర్చుకోవాలని సూచించారు. అమెరికాతో చర్చలు ఫలించకపోతే అమెరికా దిగుమతులపై కూడా 50 శాతం సుంకాలు విధించాలని.. అప్పుడే ట్రంప్ దిగొస్తారని పేర్కొన్నారు.
అయినా మనపై ట్రంప్ ఎందుకు అంత కోపంగా ఉన్నారో తెలియడం లేదన్నారు. చైనాకు 90 రోజులు గడువు ఇచ్చారని.. మనకు మాత్రం 21 రోజులు మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. మనం కూడా 50 శాతం సుంకం విధిస్తేనే దారిలోకి వస్తారని పేర్కొన్నారు. భారతదేశం ప్రస్తుతం అమెరికా దిగుమతులపై 17 శాతం సుంకాలను విధిస్తోందని.. దానిని 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. మీరు చేస్తే.. మేము చేస్తామన్న ధోరణిలో బెదిరించాలన్నారు. రష్యా దగ్గర చమురు తక్కువగా దొరుకుతుంది కాబట్టే భారత్ కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఏ దేశమైనా అదే పని చేస్తుందన్నారు. ఏ ప్రభుత్వమైనా అన్నదాతలకు నష్టం కలిగించే చర్యలకు పూనుకోకూడదని శశిథరూర్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు