హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.)
ట్రంప్ టారిఫ్‌లతో ఆయా రంగాలు భారీగా దెబ్బతినే సూచనలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సముద్ర ఫుడ్, ఆటో రంగంపై ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఉద్యోగ నష్టాలతో పాటు ఆర్థిక మందగమనం జరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర ఉత్పత్తులు, వస్త్రాలు, ఆభరణాలు, ఆటో విడిభాగాల రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొంది.
ఇదిలా ఉంటే కొత్త టారిఫ్ అమలు కావడానికి ఇంకా 20 రోజుల సమయం ఉంది. ఆ సమయంలోపు ఇరు దేశాల మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదు దఫాల చర్చలు జరిగాయి. మరోసారి చర్చలకు ఆగస్టు 24న అమెరికా వాణిజ్య ప్రతినిధి బృందం భారత్‌కు రానుంది. ఈసారి జరిగే చర్చలు అయినా సత్‌ఫలితాన్ని ఇస్తుందని నిపుణులు ఆశిస్తున్నారు.
కొత్త సుంకాలు కారణంగా వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు వంటి రంగాలు భవిష్యత్‌లో తీవ్ర ప్రభావాన్ని చూడాల్సి వస్తుంది. అధిక ఒత్తిడిని ఎదుర్కోవల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్‌కు మాత్రం ఇబ్బంది కలగకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు