అమరావతి, 19 సెప్టెంబర్ (హి.స.)
దసరా కానుకగా వాహనమిత్ర అందిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆటో డ్రైవర్లలో సంతోషం వెల్లివిరుస్తోంది. ఈ పథకం కింద రూ.15 వేల చొప్పున ఖాతాలకు జమ చేస్తామని, గ్రామ, వార్డు, సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తు చేయడానికి కీలకమైన ఆటో సామర్థ్య ధ్రువపత్రం(ఎఫ్‌సీ) కోసం ఆటోవాలాలు కార్యాలయాలకు వరుస కడుతున్నారు. కడప శివారులోని ఎఫ్‌సీ ఆటోమేటిక్ కేంద్రం వద్ద గురువారం ఇలా పెద్దసంఖ్యలో ఆటోల కోలాహలం కనిపించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ