మాజీ ఆర్డీవో ఏం సాకప్ప మురళి. మధ్యంతర బెయిల్ రద్దు
దిల్లీ, 19 సెప్టెంబర్ (హి.స.) , : మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో గత ఏడాది జులై 21న జరిగిన దస్త్రాల దహనం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఆర్డీవో ఎం.సాకప్ప మురళికి జూన్‌ 2న ఇచ్చిన మధ్యంత బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. ఈ మేరకు జస్టిస్‌ మనోజ్‌మి
మాజీ ఆర్డీవో ఏం సాకప్ప మురళి. మధ్యంతర బెయిల్ రద్దు


దిల్లీ, 19 సెప్టెంబర్ (హి.స.)

, : మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో గత ఏడాది జులై 21న జరిగిన దస్త్రాల దహనం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఆర్డీవో ఎం.సాకప్ప మురళికి జూన్‌ 2న ఇచ్చిన మధ్యంత బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. ఈ మేరకు జస్టిస్‌ మనోజ్‌మిశ్ర, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2024 జులై 21న రాత్రి 11.25 గంటల సమయంలో మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మంటలు చెలరేగి పలు దస్త్రాలు కాలిపోయాయి. తొలుత ఇది ప్రమాదం అనుకున్నా, మర్నాడు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. అనుమానితుల కాల్‌డేటాను విశ్లేషించి ఇళ్లలో సోదాలు చేసి కొన్ని డాక్యుమెంట్లు సీజ్‌ చేశారు. మురళి 2022 అక్టోబరు నుంచి 2024 ఫిబ్రవరి 5వ తేదీ వరకు మదనపల్లెలో ఆర్డీవోగా పనిచేశారు. అగ్ని ప్రమాదానికి ఆరు గంటల ముందు ఆ కార్యాలయానికి వచ్చి అక్కడ పనిచేస్తున్న గౌతమ్‌ అనే సీనియర్‌ అసిస్టెంట్‌తో మాట్లాడి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. దాంతో పోలీసులు అతన్ని తొలుత సాక్షిగా పిలిచి వాంగ్మూలం రికార్డు చేసినప్పుడు తాను అక్కడకు వెళ్లినట్లు అంగీకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande