అమరావతి, 19 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్రంలోని ఐదు ప్రధాన ఆలయాలకు చైర్మన్లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శ్రీశైలంలోని బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్‌గా పోతుగుంట రమేశ్ నాయుడు, శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయానికి కొట్టె సాయిప్రసాద్, కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి వి.సురేంద్ర బాబు (మణినాయుడు), విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి బొర్రా రాధాకృష్ణ (గాంధీ), వాడపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌గా ముదునూరి వెంకట్రాజు నియమితులయ్యారు. అలాగే టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు అధ్యక్షులను నియమించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, విశాపట్నంలోని కమిటీలకు వరుసగా.. ఏవీరెడ్డి, నేమూరి శంకర్ గౌడ్, వీరాంజనేయులు, ఎదుగుండ్ల సుమంత్ రెడ్డి, గౌతమ్ సింగానియా, వెంకట పట్టాభిరామ్ చోడే నియమితులయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి