తిరుమల, 20 సెప్టెంబర్ (హి.స.)
తిరుమలకు వచ్చే భక్తులకు వసతి గదులకు సంబంధించి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. తిరుమలలో నూతనంగా నిర్మించిన పీఏసీ-5 భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ భవనాన్ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో తనిఖీలు నిర్వహించారు. భవనంలోని హాళ్లు, అన్న ప్రసాద వితరణ హాలు, కల్యాణకట్ట, మరుగుదొడ్లు, తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సెప్టెంబర్ 25వ తేదిన పీఏసీ-5 భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భవనంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రాన్ని పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఈవో వెంట సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బారాయుడు, సీఈ సత్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
'తిరుమల పవిత్రత కాపాడటమే కాకుండా సాధారణ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం ముఖ్య లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు స్మూక్ష్మ, క్షేత్రస్థాయి ప్రణాళికలు రూపొందించి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. తిరుమల అన్నమయ్య భవన్‌లో ఈవో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, టీటీడీ వివిధ విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా పాలన, పోలీసులతో కలిసి సూక్ష్మ- క్షేత్రస్థాయి ప్రణాళికలు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పాల్గొనగలిగేలా సమన్వయంతో ఏర్పాట్లు. ఇప్పటికే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆభరణాల శుభ్రత, వాహనాల ట్రయల్ రన్ పూర్తి' చేశాము అన్నారు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి